Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లినాయిస్ వర్సిటీ అక్రమాలు : ఎన్నారై రాజీనామా

Webdunia
షికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ప్రవాస భారతీయుడు నిరంజన్ షా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విశ్వవిద్యాలయం ప్రవేశాలలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు రావడంతో మనస్తాపం చెందిన షా తన పదవినుంచి తప్పుకున్నారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇల్లినాయిస్ గవర్నర్‌కు పంపించిన నిరంజన్ షా... తన గౌరవానికి భంగం కలిగించేంతగా ఆరోపణలు రావడంతో కలత చెందిన తాను ఈ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కళంకపు ఆరోపణలతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాసేవ చేయలేనని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే... నిరంజన్ షా రాజీనామాను ఇల్లినాయిస్ గవర్నర్ ఆమోదించారు. త్వరలోనే ఆ పదవికి మరో అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు గవర్నర్ వెల్లడించారు. కాగా... 2003వ సంవత్సరం నుంచి షా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2007లో సమీప బంధువులకు వర్సిటీలో ఉద్యోగంతోపాటు, మూడుసార్లు తిరస్కరణకు గురైన ఓ భారతీయ విద్యార్థికి ప్రవేశం కల్పించినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

Show comments