Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లిన తెదేపా బృందం

Webdunia
ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులకు గురవుతున్న భారతీయ విద్యార్థులను, ప్రత్యేకించి తెలుగువారిని కలిసి... వారికి మనోధైర్యం కల్పించేందుకుగానూ తెలుగుదేశం పార్టీ బృందం ఒకటి ఆ దేశానికి బయలుదేరి వెళ్లింది.

కాగా, సోమవారం రాత్రి బయలుదేరిన ఈ బృందంలో తెదేపా నేత నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు ఉన్నారు. వీరు మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలకు వెళ్లి అక్కడి భారత విద్యార్థులను కలిసి.. వారికి మనోధైర్యం కల్పించేలా మాట్లాడి, బాసగా నిలవనున్నారు.

ఆ తరువాత తెదేపా బృందం మెల్‌బోర్న్, సిడ్నీ నగరాల ఉన్నతాధికారులను కలిసి... విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటి నివారణకు తగిన చర్యలు చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియాలో అగంతకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న శ్రావణ్ కుమార్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు.

శ్రవణ్ చికిత్సకు ఎంత మొత్తం ఖర్చయినా భరించాల్సిందిగా భారత హై కమీషన్‌ను కోరినట్లు సీఎం కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రావణ్ చికిత్సకు వెచ్చించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగీ చెల్లిస్తుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments