Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్‌లో మళ్లీ దాడులు.. శ్రీలంక-భారతీయ జంటపై దాడి..!

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో ఆసియా ప్రజలకు వ్యతిరేకంగా మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఓ శ్రీలంక జాతీయుడు, భారత జాతీయురాలైన అతని భార్యపై ఆసీస్ జాత్యంహకారులు దాడికి పాల్పడ్డారు. నరనరాన జాత్యహంకారం జీర్ణించుకుపోయిన 25 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన ఆసీస్ యువకుల గుంపు తప్పతాగి బాధితులపై దాడికి పాల్పడింది.

60 సంవత్సరాల శ్రీలంక జాతీయుడు రంజీత్ సహస్రనమన్, భారత జాతీయురాలైన అతని భార్య అగల్య సహస్రనమన్‌లపై మెల్‌బోర్న్‌లోని కారామ్స్ డౌన్ సబర్బన్‌లోగల వారి సొంత ఇంట్లోనే దుండగులు దాడికి పాల్పడ్డారు. దుండగులు రెండున్నర గంటలపాటు రంజీత్ ఇంట్లో వీరంగం సృష్టించారు. అయితే రంజీత్ దుండగులకు ఎదురొడ్డి, చాలాసేపు గట్టిగా పెనుగులాడాడు. ఇక పోలీసులు పోలీసులు రంగ ప్రవేశం చేస్తారనంగా దుండగులు పరారయ్యారు.

గత 19 సంవత్సరాల కాలం నుంచి రంజీత్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. తన భార్యా ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న రంజీత్‌పై యువకుల గుంపు ఉద్దేశ్యపూర్వకంగానే, జాత్యహంకార దాడికి పాల్పడింది. కాగా, ఈ దాడిలో తెల్ల యువకుల గుంపు తన ఇంటి వెనుకవైపు కంచెను ధ్వంసం చేసి, దాని ద్వారా ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడిందని ఆయన పోలీసులకు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments