Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో పీజీ డిగ్రీలున్నవారికి గ్రీన్ కార్డులు

Webdunia
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా కలిగిన విదేశీ వృత్తి నిపుణులకు నేరుగా గ్రీన్ కార్డులు మంజూరు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. విదేశీ వృత్తి నిపుణులు తమ దేశం వదలి వెళ్లకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా... ఇటీవలనే అమెరికా కాంగ్రెస్‌లో ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు గనుక కాంగ్రెస్ ఆమోదం పొందినట్లయితే... భారతదేశంతో సహా పలు దేశాలకు చెందిన పీజీ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండవచ్చు. పీజీలున్నవారు హెచ్1బి వీసాలు, వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోకుండా నేరుగా గ్రీన్ కార్డుకే దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పై బిల్లుకు ఆమోదం లభిస్తే.. అమెరికాలో అత్యధికంగా పీజీ పట్టాలు పొందుతున్న భారత్, చైనా విద్యార్థులకే ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. ఇలాంటి వారిని హెచ్1బి వీసా కోటా పరిమితి నుంచి కూడా మినహాయింపు ఇస్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments