అమెరికాలో జాతిపిత మహాత్మాగాంధీ పేరుతో జిల్లా..!

Webdunia
FILE
భారత 60వ గణతంత్ర దినోత్సవానికి అమెరికాలోని ప్రవాస భారతీయులు మాతృదేశానికి ఓ విశిష్టమైన బహుమతిని అందజేశారు. జాతిపిత మహాత్మాగాంధీ పేరును అమెరికాలోని ఒక జిల్లాకు పెట్టడంద్వారా అగ్రరాజ్యంలో భారత కీర్తిపతాకను రెపరెపలాడించారు.

టెక్సాస్ రాష్ట్రంలోని గ్రేటర్ హూస్టన్ ప్రాంతంలో ఉన్న హిల్‌క్రాప్ట్ పేరును అధికారికంగా మహాత్మాగాంధీ జిల్లాగా మార్చేందుకు ప్రవాస భారతీయులు విశేషంగా కృషి చేశారు. ఈ మేరకు నగర మేయర్ అనీస్ పార్కర్, హూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ సంజీవ్ ఆరోరా కలిసి సంయుక్తంగా ప్రకటన చేశారు.

దీంతో ఏడు సంవత్సరాలు ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి ఫలించినట్లైంది. కాగా గ్రేటర్ హూస్టన్‌లో లక్షమందికి పైగా ప్రవాస భారతీయులు నివసిస్తుండటం గమనార్హం. జిల్లాకు గాంధీజీ పేరును పెట్టడంతో అక్కడి ప్రవాస భారతీయులు ఆనందోత్సాహాల నడుమ గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

రెండు రోజుల్లో పెళ్లి.. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Show comments