Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతుల్ ఖన్నాకు ఫీన్‌లాండ్ పురస్కారం

Webdunia
భారతదేశానికి చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త అతుల్ ఖన్నాను ఫీన్‌లాండ్ ప్రభుత్వం తన అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. శాస్త్ర, వాణిజ్య రంగాలలో భారత్-‌ఫీన్‌లాండ్‌ల మధ్య సంబంధ బాంధవ్యాల మెరుగుదలకు కృషి చేసినందుకుగాను అతుల్‌ను "నైట్" పురస్కారంతో సత్కరించారు.

ఈ సందర్భంగా, సిస్టమ్స్ బయోలజీ వ్యవస్థాపకుడు, బోర్డు ఛైర్మన్ అయిన అతుల్ ఖన్నాను.. "నైట్‌"గా, "ఫస్ట్ క్లాస్‌"గా, "ఆర్డర్ ఆఫ్ ది లైన్ ఆఫ్ ఫీన్‌లాండ్‌" గా దేశాధ్యక్షుడు తార్జా హలోనెన్ ప్రకటించారు. హెల్సింకి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అతుల్‌కు "ఆర్డర్ టు" ప్రదానోత్సవం 35 వేల మంది విద్యార్థుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.

బయో టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ మార్ట్ శార్మాతో కలిసి అతుల్ ఇరు దేశాల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో యూనివర్సిటీ పేర్కొంది. టూల్ టెక్ గ్లోబల్ ఇంజనీరింగ్‌తో పాటు వివిధ సంస్థలను నెలకొల్పిన అతుల్ వాటిని విజయవంతంగా నిర్వహించారని ఫీన్‌లాండ్ అధికారులు ఒక ప్రకటనలో కొనియాడారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

Show comments