Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ్‌ను పరామర్శించిన ఎస్ఎం కృష్ణ

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో మూడు నెలల క్రితం జాత్యహంకార దాడికి గురైన తొలి భారతీయ విద్యార్థి శ్రావణ్ కుమార్‌ను భారత విదేశాంగమంత్రి ఎస్.ఎం. కృష్ణ పరామర్శించారు. ఆ దేశంలో తన ఐదురోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం రోజున కృష్ణ, శ్రావణ్‌ ఇంటికి వెళ్లి, అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా, వ్యక్తిగత సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.

పావుగంటసేపు శ్రావణ్ కుటుంబంతో గడిపిన కృష్ణతో.. శ్రావణ్ తండ్రి చిదంబరరావు మాట్లాడుతూ... తమ కుమారుడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని పేర్కొన్నారు. అయితే శ్రావణ్ కోలుకునేందుకు భారత ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆసుపత్రి ఖర్చులయితే ఆసీస్, భారత్‌ ప్రభుత్వాలూ రెండు భరిస్తున్నాయని చిదంబరరావు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున కృష్ణ శ్రావణ్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. కాగా.. అంతకుమునుపు కృష్ణ, విక్టోరియా రాష్ట్ర ప్రధాని జాన్ బ్రూమ్‌బేను కలిసి, భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల గురించి చర్చించారు. అనంతరం సీనియర్ పోలీసు అధికారులతోపాటు ఆయన, నేరాలు ఎక్కువగా జరిగే రాష్ట్ర పశ్చిమ శివారు ప్రాంతాలలో పర్యటించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments