Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ విద్యార్థులకు వీసాలతో పాటు "గైడ్"లు...!

Webdunia
భారత విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తమ దేశం సురక్షితమైందన్న సందేశాన్నిచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగా ఇకనుంచి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు వీసాలతో పాటు సమగ్ర సమాచారం ఉండే చిన్న పుస్తకాన్ని కూడా అందించాలని భావిస్తోంది.

" గైడ్ టూ స్టడీయింగ్ అండ్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా" అనే పేరుతో ముద్రించనున్న ఈ పుస్తకంలో ఆసీస్ సమాజంపై అవగాహన కల్పించే సమాచారాన్ని పొందుపరచనున్నారు. ఇంకా ఈ గైడ్‌లో ఆసీస్ సమాజం, సంస్కృతి, వారితో కలిసిపోయేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఉంటాయి.

విదేశీ విద్యార్థులకు సురక్షిత ప్రాంతంగా తమకున్న పేరుకు భంగం వాటిల్లడాన్ని తీవ్రంగా పరిగణించిన తాము.. ఈ రకమైన చర్యలను చేపట్టామని ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వ్యాపార శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా... భారత విద్యార్థులపై దాడికి పాల్పడిన దుండగులను తమ ప్రభుత్వం చట్టం ముందు తప్పకుండా నిలబెడుతుందని చెప్పారు.

విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునేందుకు... రెండు రోజులపాటు అంతర్జాతీయ విద్యార్థులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 14వ తేదీ నుంచి కాన్‌బెర్రాలో నిర్వహించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించినట్లు పై ప్రతినిధి పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments