Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమున పరిశుభ్రతకు ఎన్నారైల విశేష కృషి..!

Webdunia
FILE
" లో కాస్ట్ టెక్నాలజీ"తో యమునా నదిని శుభ్రం చేసేందుకు ఒక ఎన్నారై టీమ్ మధుర పట్టణానికి చేరుకుంది. దేశంలో ఎక్కువగా కలుషితం అయిన నదులను శుభ్రం చేసేందుకు ఈ ఎన్నారై టీమ్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యమునా నదీ జలాలను పరిశుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యింది.

ఈ సందర్భంగా ఎన్నారై బృందానికి చెందిన బజ్ రాజ్ షరన్ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. యమునా నదిని పరిశుభ్రం చేసేందుకు ఒక బిడ్ వేశారన్నారు. ఇందులో భాగంగా తాము రివర్ స్ట్రీమ్ పవర్డ్ ఏరియేటర్స్‌ మరియు పంపులతో నదీ జలాల్లోకి గాలిని పంపిస్తామని చెప్పారు. ఇలా చేయటంవల్ల నదీ జలాల్లో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, సముద్ర జీవరాశుల ఉనికిని పునరుజ్జీవింపజేసే అవకాశం ఉంటుందని షరన్ వివరించారు.

ఏరియేటర్లను వేగంగా ప్రవహించే నదీజలాల ద్వారా ఏర్పడే శక్తితో నడుస్తాయని, వీటిని షేర్‌గర్ ఏరియాలో ఏర్పాటు చేయనున్నామని షరన్ పేర్కొన్నారు. ఈ ఏరియేటర్లు పర్యావరణానికి 20 శాతం ఆక్సిజన్‌ను అందిస్తాయని చెప్పారు. అలాగే నీటిలో కూడా ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచటమేగాక, సముద్ర జీవుల ఉనికిని కాపాడుతాయని వివరించారు. ఈ ఏరియేటర్ల పనితీరును తాము ఫిబ్రవరి 17వ తేదీన వృందాబన్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు షరన్ తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments