Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో సామరస్య ర్యాలీ

Webdunia
బహుళ సంస్కృతులకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించేందుకు.. విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా సురక్షిత ప్రాంతమేనని సందేశం ఇచ్చేందుకుగానూ.. విక్టోరియా ప్రభుత్వం ఆదివారం మెల్‌బోర్న్‌‌లో ఓ సామరస్య ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భారతీయులతో పాటు వేలాదిమంది పాల్గొన్నారు.

మెల్‌బోర్న్, సిడ్నీ ప్రాంతాలలో భారతీయ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన వ్యక్తం కావడంతో విక్టోరియా ప్రభుత్వం ఈ ర్యాలీని నిర్వహించింది. భిన్న సంస్కృతులకు మద్ధతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే... ఈ ర్యాలీలో తాము మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో, ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశంలోని భారత విద్యార్థుల సంఘం (ఫిసా) ప్రకటించింది. అయితే, ముందుగా దూరంగా ఉండాలనుకున్న ఫిసా తన నిర్ణయం మార్చుకుని, భారతీయ విద్యార్థులు కేవలం పరిశీలకులుగా పాల్గొనాలని సూచించింది.

కాగా... భారతీయ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడులకు సంబంధించిన చర్చల్లో తమను పక్కకు పెట్టేందుకు ఆసీస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిసా ప్రతినిధి గౌతమ్‌గుప్తా ఈ సందర్భంగా ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments