Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ బాలుడి హత్య: గురుసేవక్ థిల్లాన్ అరెస్టు

Webdunia
FILE
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన మూడు సంవత్సరాల బాలుడు గురుషాన్ సింగ్ చన్నా హత్య కేసులో గురుసేవక్ థిల్లాన్ అనే 23 సంవత్సరాల భారతీయ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం మెల్‌బోర్న్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో నిందితుడిని పోలీసులు హాజరు పరిచారు.

కాగా.. గురుసేవక్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి ప్రకటించినప్పటికీ, అతడు బెయిల్ ప్రయత్నాలేమీ చేయటంలేదని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. తనపై ఆరోపణలు వచ్చినప్పటికీ కోర్టులో గురుసేవక్ చాలా మౌనంగా కూర్చున్నాడేగానీ, మరేమీ మాట్లాడలేదు. ఒక నిమిషంకంటే తక్కువ సమయం సాగిన ఈ కేసు విచారణ, అదనపు సాక్ష్యాధారాల సేకరణ నిమిత్తం జూన్ 29వ తేదీనాటికి వాయిదా పడింది.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలోని పర్యాటక కేంద్రాలను తిలకించేందుకు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన గురుషాన్ ఐదురోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని అక్లాండ్ జంక్షన్‌, వైల్డ్‌వుడ్ రోడ్డులో ఈ బాలుడి శవం పడివుండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. కాగా, బాలుడు కనిపించకుండా పోయిన 45 నిమిషాల్లో అతని తల్లి హరప్రీత్ కౌర్ చన్నా పోలీసులుకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన బాలుడు మృతి చెందినట్టు అతని ధరించిన చొక్కా, జీన్స్ ఆధారంగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments