Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడులపై ఆస్ట్రేలియా హైకమీషన్‌కు సీఎం లేఖ

Webdunia
ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై జరుగుతున్న దాడుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా... ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు భారత్‌లోని న్యూఢిల్లీలో గల ఆ దేశ రాయబారి జాన్ మెక్‌కార్తి ఓ లేఖను రాసిన వైఎస్సార్... రాష్ట్రానికి చెందిన చాలామందిపై దాడులు జరిగాయని అందులో వివరించారు.

ఆస్ట్రేలియాలో ఆంధ్ర విద్యార్థులపై జరుగుతున్న దాడులకు సంబంధించి తమ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, దీనిని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వైఎస్సార్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఆస్ట్రేలియా చాలా శాంతికాముక దేశమని విన్నామనీ... కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... అమెరికాలోని దక్షిణ మిసిసీపీ దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఎమ్.ఎస్. విద్యార్థి కడియాల మురళీకృష్ణ తల్లి నాగ సామ్రాజ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, కొడుకును పరామర్శించేందుకు అమెరికా వెళ్లేందుకుగానూ, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఆమెకు 75 వేల రూపాయల సాయాన్ని విడుదల చేస్తూ, ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments