Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో తూ.గో.వాసి మృతి

Webdunia
జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాకర్ హుస్సేన్ (48) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాజూరు మండలం చేదువాడ గ్రామానికి చెందిన ఇతను ఆరు నెలల క్రితం మామిడి కుదురు మండలం, నగరం గ్రామానికి వలస వచ్చాడు.

నగరం గ్రామంలోనే జీవనం సాగిస్తున్న బాకర్ హుస్సేన్.. కొద్దికాలం క్రితం ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అక్కడ అగ్గిపెట్టెల పరిశ్రమలో పనికి కుదిరిన ఈయన.. కొన్నాళ్లపాటు ఇక్కడి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి తన క్షేమసమాచారాలను చెబుతుండేవాడు.

అయితే గత కొన్ని రోజులుగా బాకర్ హుస్సేన్ నుంచి ఎలాంటి సమాచారమూ అందక పోవటంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనలో పడ్డారు. ఈలోగానే హుస్సేన మరణవార్త కుటుంబీకులకు తెలిసింది. అంతే వారంతా శోకసముద్రంలో మునికిపోయారు. కాగా... హుస్సేన్ దక్షిణాఫ్రికాలోని ఏ ప్రాంతంలో, ఎలా చనిపోయాడన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments