Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాత్యహంకార దాడులను సహించేది లేదు : బ్రంబీ

Webdunia
FILE
జాత్యహంకార దాడులను సహించబోమని, విదేశీ విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని.. విక్టోరియా రాష్ట్ర ప్రధాని జాన్ బ్రంబీ స్పష్టం చేశారు. జాతి వివక్ష దాడులను అణచివేసేందుకు తమ రాష్ట్ర పోలీసులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టామని ఆయన తెలిపారు.

న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని బ్రంబీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ విద్యార్థులపై దాడుల నివారణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దాడులు ఇకపై పునరావృతం కాబోవని తమ ప్రభుత్వం, విక్టోరియా రాష్ట్ర ప్రజల తరపున విద్యార్థులకు బ్రంబీ భరోసా ఇచ్చారు

అలాగే జాతి వివక్ష దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోందని బ్రంబీ వెల్లడించారు. అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ తర్వాత ఆయన ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా బ్రంబీ ముంబై పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments