Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ హత్యపై దర్యాప్తుకై భారత్ డిమాండ్

Webdunia
దక్షిణాఫ్రికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్ హత్యపై దర్యాప్తు జరిపించాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కిరణ్ హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జోహెన్నెస్‌బర్గ్ నగర పోలీసు కమీషనర్‌ను కోరినట్లు దక్షిణాఫ్రికాలోని భారత ఉప రాయబారి అరవింద నాన్వెల్ వెల్లడించారు.

ఈ విషయమై అరవింద మాట్లాడుతూ... కిరణ్ హత్యోదంతాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం దృష్టికి తేవాలని తాము కోరినట్లు తెలిపారు. కిరణ్‌పై జరిగిన దాడి వెనుక జాతి వివక్ష ఉందని అనుకోవడం లేదని, కేవలం దోపిడీ చేసేందుకే దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు.

ఈ దేశంలో గతంలో కూడా భారతీయులపై చిన్నపాటి దాడులు జరిగాయని, అయితే అలాంటి దాడుల్లో చనిపోవడం మాత్రం ఇదే మొదటిసారని అరవింద పేర్కొన్నారు. కిరణ్ మృతదేహం స్వదేశానికి తరలించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే... వరంగల్ జిల్లా ఆరెపల్లికి చెందిన కిరణ్‌పై దుండగులు కాల్పులు జరిపి... ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే...!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments