Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్‌లో హత్యకు గురైన గుర్షన్‌కు అంత్యక్రియలు పూర్తి..!!

Webdunia
PTI
ఆస్ట్రేలియాలో హత్యకు గురైన మూడేళ్ల చిన్నారి గుర్షన్ సింగ్ చన్నాకు సోమవారం అతని స్వగ్రామం పంజాబ్‌లోని కోట్కపురాలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. వందలాది ప్రజలు కాలినడకన గుర్షన్ ముతృదేహంతోపాటు స్మశానానికి తరలివెళ్లి అంత్యక్రియలను నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఆస్ట్రేలియా నుంచి ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చిన గుర్షన్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులు నేరుగా తమ స్వగృహానికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి ప్రధాన వీధులగుండా దగ్గర్లోని రామ్‌బాగ్ స్మశానవాటికకు తరలించారు. ఈ సందర్భంగా వందలాది ప్రజలు గుర్షన్ మృతదేహం వెంట నడిచి, ఆ చిన్నారికి వీడ్కోలు పలికారు.

బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు, సీనియర్ ఆఫీసర్లు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులు తదితరులు గుర్షన్ మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిక్కుమత ప్రార్థనల అనంతరం గుర్షన్ మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలోని పర్యాటక కేంద్రాలను తిలకించేందుకు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన గురుషాన్ కొన్నిరోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని అక్లాండ్ జంక్షన్‌, వైల్డ్‌వుడ్ రోడ్డులో ఈ బాలుడి శవం పడివుండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించిన సంగతి విదితమే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments