Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని దాడుల పరంపర : మరో ముగ్గురికి గాయాలు

Webdunia
DBMG
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జాత్యహంకారపు రక్కసి కోరలకు మరో ముగ్గురు భారతీయులు చిక్కి గాయపడ్డారు. ప్రస్తుతం దాడులు తగ్గుముఖం పట్టాయని, దాడుల అణచివేతకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఆసీస్ ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రకటించినా.. ఈ దాడులకు అడ్డుకట్ట పడే మార్గం కనిపించటం లేదు. పైగా రోజు రోజుకీ అవి తీవ్రమవుతున్నాయి.

సిడ్నీలోని ఓ హోటల్ వద్ద జరిగిన ఘర్ణలో గత వారం ఇద్దరు భారతీయ విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపలే దుండగులు చల్లగా జారుకున్నారు. ఈలోపే బాధితులిద్దరూ వొల్లాంగ్ ఆసుపత్రిలో చేరినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకోవద్దంటూ బాధితులిరువురూ తమను కోరినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసు అధికారి బ్రియాన్ వైవర్ మీడియాకు వెల్లడించారు.

ఇక అడిలైడ్ నగరంలో జరిగిన మరో సంఘటనలో తప్పతాగిన నలుగురు గుర్తు తెలియని దుండగులు.. ఒక భారత విద్యార్థిపైకి దాడికి దిగి గాయపర్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పలు రకాల సంఘటనలు వెలుగులోకి వస్తున్నా... తమ దేశం విదేశీ విద్యార్థులకు చాలా సురక్షితమైనదంటూ తెలియజెప్పేందుకు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎవాన్స్ భారత్‌కు రానుండటం కాస్త విడ్డూరంగ ా అనిపించకమానదు...!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments