Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యుత్తమ వర్సిటీల జాబితాలో భారత్‌కు చోటు నై..!

Webdunia
FILE
ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఏ ఒక్క భారతీయ విశ్వవిద్యాలయానికీ చోటు దక్కలేదు. అమెరికా, బ్రిటన్ విశ్వవిద్యాలయాలే వీటిలో ఎక్కువగా స్థానం సంపాదించాయి. క్యూస్‌/టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన ఈ ర్యాకింగ్స్‌లో.. అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయం 2009 సంవత్సరానికికూడా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.

యేల్ విశ్వ విద్యాలయం మాత్రం ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి దిగజారగా.. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానానికి ఎగబాకడం విశేషంగా చెప్పవచ్చు.

అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఒక్కసారిగా తన స్థానాన్ని మెరుగుపరచుకుని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల సరసన నిలవటమేగాక.. దాంతోపాటు ఐదో స్థానాన్ని పంచుకుంది. కాగా ఈ టాప్ 100 జాబితాలో ఆసియా విశ్వవిద్యాలయాల సంఖ్య 14 నుంచి 16కు పెరిగింది. టోక్యో వర్సిటీ 22వ స్థానంలోనూ, హాంకాంగ్ వర్సిటీ 24వ స్థానంలో నిలిచాయి.

ఇదిలా ఉంటే.. జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్లలోని విశ్వవిద్యాలయాలు వడివడిగా పాశ్చాత్య వర్సిటీలను అందుకుంటున్నాయని బ్రిటన్ వర్సిటీల ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే బ్రిటన్‌లోని పరిశోధక విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయంగా మంచి పేరును సంపాదించుకున్నాయని ఈ సర్వే ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఇక మొదటి పది స్థానాలలో నిలిచిన వర్సిటీల వివరాల్లోకి వస్తే.. హార్వార్డ్, కేంబ్రిడ్జ్, యేల్, యూసీఎల్, లండన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఆక్స్‌ఫర్డ్, చికాగో, ప్రిన్సిటన్, ఐమ్ఐచీ, మసాచుసెట్స్, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. తదితర వర్సిటీలు నిలిచాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments