Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్ స్పెషల్ : వెజ్ గార్లిక్ చికెన్ ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 7 ఫిబ్రవరి 2015 (16:10 IST)
కూరగాయలు, వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఒబిసిటీని దూరం చేస్తాయి. అలాంటి హెల్దీ కూరగాయలు, వెల్లుల్లితో చికెన్ కాంబినేషన్‌లో వెజ్ గార్లిక్ చికెన్ ఎలా వుంటుందో ఈ వీకెండ్ ట్రై చేద్దాం.. 
 
కావల్సిన పదార్థాలు: 
బోన్ లెస్ చికెన్: అరకేజీ
క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు : తలా పావు కప్పు 
కొత్తిమీర తరుగు : ఒక కప్పు 
వెల్లుల్లి పేస్ట్: పావు కప్పు 
కార్న్ ఫ్లోర్ : రెండు టేబుల్ స్పూన్లు 
ఎండు మిర్చి : ఒక స్పూన్  
చిల్లీ గార్లిక్ సాస్ : నాలుగు టేబుల్ స్పూన్లు  
వరెస్టర్ షైర్ సాన్: రెండు టేబుల్ స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు : రెండు స్పూన్లు
బ్లాక్ పెప్పర్: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు, నూనె, నీళ్ళు : రుచికి సరిపడా
 
తయారీ విధానం: 
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేడి చేయాలి. వేగిన తర్వాత అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కూరగాయల ముక్కలను (క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు) ఒకదాని తర్వాత ఒకటి వేసి 5నుండి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
 
ఇప్పుడు అందులో ఉప్పు, బ్లాక్ పెప్పర్ పొడి, వరెస్టర్ షైర్ సాస్, చిల్లీ గార్లిక్ సాస్ వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.  కొద్దిగా నీళ్ళు పోసి, నీళ్ళు మరిగేటప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ వేగించుకోవాలి. మంటను కొద్దిగా ఎక్కువగా పెట్టి, చికెన్, వెజిటేబుల్స్‌ను 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే వెజిటేబుల్ గార్లిక్ చికెన్ రిసిపి రెడీ.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments