వీకెండ్ స్పెషల్ : ఓవెన్ లేకుండా తందూరి చికెన్ చేసేయండి!

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (16:34 IST)
నాన్ వెజ్ ప్రియులా? అయితే ఈ వీకెండ్ స్పెషల్‌గా తందూరి చికెన్ ట్రై చేయండి. ఓవెన్ లేకుండా.. క్రిస్పీగా చేయాలంటే... హోం మేడ్ తందూరి చికెన్ ఇలా తయారు చేయండి. 
 
కావల్సిన పదార్థాలు: 
చికెన్: అరకేజీ
మ్యారినేషన్ కోసం కావల్సిన పదార్థాలు: 
పెరుగు: ఒక కప్పు 
రెడ్ ఫుడ్ కలర్ : కొన్ని చుక్కలు
పచ్చిమిర్చి పేస్ట్ : ఒక టీ స్పూన్ 
గరం మసాలా: రెండు టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయ పేస్ట్ : పావు కప్పు  
అల్లం పేస్ట్ : రెండు టీ స్పూన్లు 
నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు 
వెల్లుల్లి రెబ్బలు: 2
ఉప్పు: రుచికి సరిపడా 
నూనె: తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి తడిఆరే వరకు పక్కన బెట్టుకోవాలి. తందూరి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టాలంటే, గాట్లు పెట్టుకోవాలి. చికెన్ నిమ్మరసం ఉప్పు చికెన్ ముక్కలకు పట్టించాలి. గాట్లులోకి కూడా నిమ్మరసం పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి.
 
చికెన్ ముక్కలను 20నిముషాలు రిఫ్రిజరేటర్‌లో పెట్టాలి. ఉల్లి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గరం మసాలా పేస్ట్‌ను రెండు గంటల తర్వాత ఫ్రిజ్‌లో ఉన్న చికెన్ ముక్కలను పట్టించాలి.  చికెన్ ముక్కలకు మసాలను పట్టించడానికి ముందు మసాలాలో కొద్దిగా ఫుడ్ కలర్‌ను జోడించాలి. 
 
చికెన్ ముక్కలకు మసాలా పట్టించిన తర్వాత తిరిగి చికెన్ ముక్కలను రిఫ్రిజరేటర్‌లో 30-40నిముషాలు ఉంచాలి. నాలుగు గంటల తర్వాత మ్యారినేట్ చికెన్ బయటకు తీసి, పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 10-15నిముషాల వరకూ ఒక్కో వైపు బాగా ఫ్రై చేయాలి.

15నిముషాల తర్వాత చికెన్‌ను రెండువైపులా తిప్పుతూ.. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీసి గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే తందూరి చికెన్ ఈ రైనీ సీజన్‌కు రెడీ అయినట్లే. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

కోవైలో పదేళ్ల బాలిక చనిపోతే.. ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ బదులిస్తారా? విజయ్ సీరియస్ (video)

తెలంగాణాలో బెంబేలెత్తిస్తున్న ఎండలు.. ఒక్కరోజే 42 మంది మృత్యువాత

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Show comments