Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్ స్పెషల్ : హెల్దీ చికెన్ మష్రూమ్ సూప్!

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2014 (18:38 IST)
చికెన్‌లో పోషకాలు దాగివున్నాయి. ఇంకా మష్రూమ్ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. వెయిట్ లాస్‌కు మష్రూమ్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలం ఇటువంటి సూప్ తీసుకోవడం, దగ్గు, జలుబు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్‌లో ఈ వీకెండ్ చికెన్ మష్రుమ్ సూప్ ట్రై చేద్దామా..!
 
కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: పావు కేజీ 
చికెన్ స్టాక్: నాలుగు కప్పులు 
పచ్చిమిర్చి: రెండు టీ స్పూన్లు 
మిరియాల పొడి : రెండు టీ స్పూన్లు 
కొత్తిమీర తరుగు : అర కప్పు 
బట్టర్: ఒక టేబుల్ స్పూన్
మష్రుమ్: రెండు కప్పులు 
ఉల్లిపాయలు: ఒక కప్పు 
ఉప్పు: రుచికి సరిపడా
 
తయారీ విధానం : 
ముందుగా కుక్కర్లో చికెన్‌ను ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్‌లో చికెన్ ముక్కలను వేరుగా తీసుకోవాలి. చికెన్ ఉడికించిన నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. 
 
పాన్‌లో కొద్దిగా బట్టర్ వేసి కరిగిన తర్వాత పెప్పర్ పొడి వేసి ఒక సెకన్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిముషాలు వేగించుకోవాలి. ఇందులో మష్రుమ్ కూడా వేసి వేయించాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ కాడలు, పక్కన పెట్టుకొన్న సన్నని చికెన్ పీసులు వేసి బాగా మిక్స్ చేసి 2నిముషాలు వేపుకోవాలి. 
 
ఇందులో నాలుగు కప్పులు నీరు పోసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి. ఉప్పు, కొత్తిమీర మిక్స్ చేసుకుని కాసేపు మంట మీద ఉంచి.. దించేస్తే చికెన్ మష్రూమ్ సూప్ రెడీ. ఈ సూప్‌ను బౌల్‌లోకి తీసుకుని కార్న్ చిప్స్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments