వీకెండ్ స్పెషల్: క్విక్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ!

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (18:13 IST)
కోడిగుడ్డులో చాలా పోషకాలున్నాయి. పోషకాహార లోపాన్ని కోడిగుడ్డు దూరం చేస్తుంది. అందుకే పిల్లలైనా పెద్దలైనా రోజుకో కోడిగుడ్డు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాంటి కోడిగుడ్డు ఈజీగా ఎగ్ కర్రీ చేస్తే ఎలా వుంటుందో ఈ వీకెండ్ స్పెషల్‌లో చూద్దాం.. ఈజీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా చేయాలంటే..
 
కావలసిన పదార్థాలు :
ఉడికించిన కోడిగుడ్డు : నాలుగు 
ఉల్లిపాయ పేస్ట్: పావు కప్పు 
అల్లం-వెల్లుల్లి పేస్ట్: పాపు కప్పు
కారం పొడి: రెండు టీ స్పూన్లు 
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: ఒక టేబుల్ స్పూన్ 
ధనియా పొడి: ఒక టీ స్పూన్ 
గరం మసాలా పొడి: ఒక టీ స్పూన్ 
టమోటో గుజ్జు: పావు కప్పు 
పసుపు పొడి: ఒక టేబుల్ స్పూన్ 
దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, నూనె : తగినంత. 
 
తయారీ విధానం: 
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేపుకోవాలి. పసుపు, కారం, ధనియాపౌడర్, గరం మసాలా, ఉప్పు, పంచదార కూడా జతచేసుకుని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి మీడియం మంట మీద మరో 5 నిముషాలు వేగించాలి. 
 
అరకప్పు నీళ్ళు పోసి రెండు నిముషాలు సిమ్‌లో ఉంచి ఉడికించాలి. గ్రేవీ బాగా ఉడికి, చిక్కబడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లు అందులో వేసి, బాగా మిక్స్ చేయాలి. ఒక ఐదు నిముషాలు అలాగే సిమ్‌లో ఉంచి దించేయాలి. ఈ ఎగ్ కర్రీ వేడి వేడి రైస్‌తో పాటు రోటీలకు టేస్ట్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Show comments