చేపల్లో ఏముంది? వారానికి 2సార్లు తీసుకుంటే మంచిదా? ఫ్రై ఎలా చేయాలి?

చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలనుకునేవారు, మెదడు చురుగ్గా పనిచేయాలనుకునే వారు వారానిక

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (17:10 IST)
చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలనుకునేవారు, మెదడు చురుగ్గా పనిచేయాలనుకునే వారు వారానికి రెండు సార్లు చేపలతో కూడిన వంటకాలను తీసుకోవాలి. అలాంటి చేపలతో కూరలు చేసి బోర్ కొట్టేస్తుందా.. అయితే ఈ వజరం చేపల ఫ్రైని ఎలా చేయాలో ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు :
వంజరం చేప ముక్కలు - అర కేజీ 
అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కప్పు, 
గరం మసాలా, కారం, పసుపు -  తలా అర స్పూన్, 
నూనె, ఉప్పు - వేయింపుకు సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఓ పాన్‌లోకి తీసుకోవాలి. అల్లం, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు కలుపుకుని చేపలకు పట్టించి అరగంట పాటు పక్కనబెట్టేయాలి. అరగంట తర్వాత బాణలిలో నూనె వేడి చేసి మసాలాలో బాగా నానిన చేప ముక్కల్ని రెండువైపులా దోరగా కాల్చాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేస్తే వంజరం చేపల ఫ్రై రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాయుగుండం ప్రభావం - ఏపీకి రెయిన్ అలెర్ట్

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వేశాఖ

తూఛ్.. జగన్ యథాలాపంగా అన్నారు.. అంతే... : సజ్జల రామకృష్ణారెడ్డి

వీడని స్నేహబంధం.. అంత్యక్రియలూ ఒకే చోట...

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోడి ఓంకార జపం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్

AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments