టేస్టీ చికెన్ లాలీ పాప్స్ ఎలా చేయాలి

Webdunia
గురువారం, 2 జులై 2015 (16:49 IST)
చికెన్‌లోని విటమిన్ బీ3 మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఇందులోని బీ6 వ్యాధినిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. రక్త కణాల వృద్ధికి చికెన్‌లోని విటమిన్ బి7 ఎంతగానో సహాయపడుతుంది. చికెన్‌లో ఐరన్, జింక్‌లు కూడా ఉన్నాయి. ఈ గుడ్ హెల్త్ బెనిఫిట్స్ కలిగిన చికెన్‌తో టేస్టీ లాలీ పాప్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ లాలీ పాప్స్ ముక్కలు - పావు కేజీ 
షేన్‌వాన్ సాస్  - రెండు స్పూన్లు 
నిమ్మరసం - అర కప్పు  
పసుపు పొడి - ఒక స్పూన్ 
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ - రెండు స్పూన్లు 
చాట్ మసాలా పౌడర్ - ఒక స్పూన్ 
ఎండు మిర్చి పౌడర్- ఒక స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
పెరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం ముందుగా చికెన్ లాలీ పాప్స్‌కు శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్, షేన్‌వాన్ సాస్, పెరుగు, పసుపు పొడి, ఎండు మిర్చి పౌడర్, ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకు బాగా మసాలా అంటాక 10-20 నిమిషాల పాటు చికెన్‌ను మ్యారినేట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను బాగా దోరగా ఉడికేంత వరకు నూనెలో వేపుకోవాలి. వీటిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని లెమన్ గార్నిష్‌తో టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ మున్సిపల్ చైర్మన్ మెడలో చెప్పుల దండ వేసి కుళ్లిన కోడిగుడ్లతో కొట్టారు, ఎందుకు? వీడియో

ఏలూరు వద్ద పెద్ద పులి సంచారం.. గోదవారిలో చేపల వేట, పర్యాటక బోట్లు రద్దు (video)

సంగం పెరుగు ప్యాకెట్లో చచ్చిన ఎలుక, షాక్ తిన్న కొనుగోలు చేసిన వ్యక్తి, వీడియో

ఒకప్పుడు ట్రోలింగ్‌లో నేనే నెం.2.. కాన్ఫిడెన్స్‌లో నెం.1: నారా లోకేష్ (video)

అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, సిరి దంపతులకు మగబిడ్డ పుట్టాడోచ్

Samantha: సమంత, రాజ్ దంపతులకు సారె పెట్టిన చిరంజీవి, సురేఖ దంపతులు

సంగీతతో సర్దుకుపోనున్న విజయ్: అందుకే త్రిష దూరం అవుతుందా?

Sai durga Tej : పాతకాలపు రొటీన్ కథలను స్వస్తి చెప్పానంటున్న సాయి దుర్గా తేజ్

Sukumar: ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణా నేపథ్యంలో సుకుమార్ చిత్రం

Show comments