స్టార్టర్స్‌ స్పెషల్ : పాప్‌కార్న్ చికెన్‌ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (18:49 IST)
హోటల్ స్టార్టర్స్‌లో చాలా ఫేమస్ అయిన పాప్‌కార్న్ చికెన్‌ను వింటర్లో ట్రై చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. వింటర్లో పాప్ కార్న్, చికెన్ శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి.

ఇందులోని పోషకాలు జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్‌లో హైజినిక్ పాప్ కార్న్ చికెన్ ఇంట్లోనే ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ : అర కేజీ 
కారం : రెండు టేబుల్ స్పూన్లు 
టొమాటో కెచప్: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు : రుచికి తగినంత
గరం మసాలా : ఒక టేబుల్ స్పూన్ 
నూనె : తగినంత
చాట్ మసాలా : అర టీ స్పూన్ 
మేథీ పొడి : చిటికెడు 
నిమ్మ రసం: ఒక టేబుల్ స్పూన్ 
అల్లం-వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్ 
మైదా పిండి : ఒక కప్పు 
కోడి గుడ్లు :  రెండు
 
తయారీ విధానం: 
 
ముందుగా ఓ పాత్రలో కారం, టొమాటో కెచప్, ఉప్పు, గరం మసాలా, మేథీ పొడి, నిమ్మరసం, అల్లం - వెల్లులి పేస్ట్‌లను బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి, సుమారు గంటసేపు నానబెట్టుకోవాలి. 
 
తర్వాత గిలక్కొట్టిన కోడిగుడ్డు సొనను కూడా వేసి, సొన ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. మరో గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో చికెన్ ముక్కల్ని వేసి, ముక్కలకు మైదా బాగా పట్టేవరకూ కలపాలి. 
 
చివరిగా ఓవెన్‌ను 20 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. బాస్కెట్‌లో చికెన్ ముక్కలను వేసి, ఎయిర్ ఫ్రయర్‌లో పెట్టి, ఐదు నిమిషాలు ఉంచాలి. ఆరేడు నిమిషాల్లో ముక్కలు వేగిపోతాయి. ఆ పైన వాటిని ప్లేట్ లోకి తీసుకుని, వాటి మీద చాట్ మసాలా, కారం జల్లి వేడివేడిగా వడ్డించాలి. అంతే పాప్ కార్న్ చికెన్ రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)

నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?

ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

Show comments