Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలర్జీలను దూరం చేసే బీరతో రొయ్యల కూర ఎలా?

ముందుగా శుభ్రం చేసిన రొయ్యలకు స్పూన్ కారం.. పావు టీ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కనబెట్టుకోవాలి. ఈ రొయ్యల్ని స్టౌ మీద బాణలి పెట్టి మూడు స్పూన్ల నూనె పోసి నీరం

Webdunia
సోమవారం, 29 మే 2017 (15:17 IST)
బీరకాయలను రోజువారీ ఆహారంలో తీసుకుంటే అలెర్జీలను దూరం చేసుకోవచ్చు. ఇంకా బరువును తగ్గించుకోవచ్చు. దోసకాయల తరహాలో బీరకాయల్లోనూ బరువు తగ్గించే గుణాలున్నాయి. ఇందులో ఫైబర్, లోఫ్యాట్స్ బరువును తగ్గిస్తాయి. అలాంటి బీరకాయలతో క్యాల్షియాన్ని పుష్కలంగా అందించే రొయ్యలతో కూర ఎలా చేయాలో చూద్దాం..
 
కావాల్సిన పదార్ధాలు:
బీరకాయ ముక్కలు - మూడు కప్పులు 
రొయ్యలు - అర కేజీ 
నూనె- రెండు టీ స్పూన్లు 
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
కరివేపాకు రెబ్బలు - పావు కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూన్ 
కారం - ఒక స్పూన్
ఉప్పు- తగినంత 
గరం మసాల పొడి-అర టీ స్పూను
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
పచ్చి మిర్చి  తరుగు - రెండు స్పూన్లు 
 
తయారీ విధానం: 
ముందుగా శుభ్రం చేసిన రొయ్యలకు స్పూన్ కారం.. పావు టీ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కనబెట్టుకోవాలి. ఈ రొయ్యల్ని స్టౌ మీద బాణలి పెట్టి మూడు స్పూన్ల నూనె పోసి నీరంతా ఆవిరయ్యేందుకు చిన్నమంటపై వేయించుకుని పక్కనబెట్టుకోవాలి. అదే బాణలిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేపుకోవాలి. ఆపై బీరకాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. 
 
ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావు కప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. దానిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చపాతీలకు రోటీలకు కూడా దీన్ని సైడిష్‌గా వాడుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments