వీకెండ్ స్పెషల్: రవ్వ ఫిష్ ఫ్రై

Webdunia
శనివారం, 17 జనవరి 2015 (18:31 IST)
కావలసిన పదార్థాలు :
చేపలు (ఒకే ముల్లు ఉండేవి) - 8 ముక్కలు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు 
కరివేపాకు - కొంచెం 
ఎండు మిరపకాయలు - ఐదు
జీలకర్ర  - టేబుల్ స్పూన్ 
పచ్చిమిరపకాయలు - నాలుగు
గసగసాలు - ఒక టేబుల్ స్పూన్
వాము - చిటికెడు
వెల్లుల్లి - ఐదు పాయలు
అల్లం - కొంచెం
రవ్వ - ఒక కప్పు
నూనె - మూడు టేబుల్ స్పూన్లు 
ఉప్పు - తగినంత
 
తయారుచేయండి ఇలా: తొలుత చేపలను బాగా శుభ్రం చేసుకుని, సమానంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంత సేపాగి చేపల్లో తేమ ఆరిన తర్వాత వాటిని ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసి, చేపలకు పట్టించాలి. మరో వైపు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర, కలిపి పేస్ట్ చేసుకోవాలి. 
 
ఈ పేస్ట్‌ను కూడా చేప ముక్కలకు అన్నివైపులా బాగా పట్టించాలి. అలా అన్నింటిని పట్టించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్‌గా ఉన్న పాన్‌ను తీసుకుని, స్టౌపై పెట్టి, అందులో కొంచెం నూనెను వేసి కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చేప ముక్కలను రవ్వలో బాగా బొర్చించి చేపలకు అన్ని వైపులా రవ్వ అంటుకునేలా చేయాలి.
 
వెంటనే ఆ చేపలను కాగి ఉన్న నూనెలో వేసి మరి కొద్ది సేపు వరకు బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే పసందైన చేపల ఫ్రై రెడీ. నూనె చాలకపోతే మరి కొంత చేర్చుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు : ప్రధాని నరేంద్ర మోడీ

రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టంలేదు : వెంకయ్య నాయుడు

అమరావతి నిర్మాణం ఇక ఆగదని అర్థమైంది.. అందుకే జగన్ అక్కసు : మంత్రి నారాయణ

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తారా?

అత్యాచారం కేసులో కేరళలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రైలర్ చూసి అలా కామెంట్స్ చేయడం మంచిదికాదు : అనిల్ రావిపూడి

అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ (Video)

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

Show comments