Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్ స్పెషల్... రవ్వ ఫిష్ ఫ్రై..!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (17:10 IST)
కావలసిన పదార్థాలు : 
ఫిష్  - 8 ముక్కలు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - కొంచెం
ఎండు మిరపకాయలు - 5 
పచ్చిమిరపకాయలు  - 4 
జీలకర్ర  - ఒక టేబుల్ స్పూన్
గసగసాలు - 1 టేబుల్ స్పూన్ 
వాము  - చిటికెడు
వెల్లుల్లి  - 5 పాయలు 
అల్లం  - కొంచెం 
రవ్వ  - ఒక కప్పు 
నూనె - 3 టేబుల్ స్పూన్లు 
ఉప్పు  - తగినంత 
 
తయారుచేయండి ఇలా : 
మార్కెట్‌లో ఒకే ముల్లు ఉన్న చేపలను తీసుకోవాలి. వాటిని సమానంగా కట్ చేసి, నీటితో శుభ్రం చేసుకోవాలి. వాటిపై తడి ఆరేంత వరకు ఉంచి, తర్వాత వాటికి ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసిన మిశ్రమాన్ని పట్టించి, ఒక పక్కన పెట్టుకోవాలి. మరో వైపు  వెల్లుల్లి పేస్ట్ ను తయారుచేసుకుని వుంచుకోవాలి. 
 
అదేవిధంగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర, ధనియాలను కలిపి మెత్తగా పేస్ట్ లా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా పేస్ట్‌ను చేపలకు అన్నివైపులా బాగా పట్టించి 10 లేదా 15 నిముషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 
 
ఇప్పుడు స్టౌపైన ఫ్లాట్ గా వుండే పాన్ ను పెట్టి, అందులో కొంచెం నూనెను వేసి వేడిచేసుకోవాలి. అందులో కొంచెం అజ్వైన్, కరివేపాకును వేసి కొద్దిసేపు వరకు వేయించాలి. మరో వైపు చేపముక్కలను రవ్వలో బాగా అర్లించి అన్నివైపులా అంటుకొనేలా చేయాలి.

ఇలా చేసిన చేప ముక్కలను వేడి చేసిన నూనెలో వేసి మరికొద్దిసేపు వరకు బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేడి చేసి, తర్వాత వాటిని ఒక ప్లేట్ లో పక్కన తీసేసుకోవాలి. అంతే రవ్వ ఫిష్ రెడీ.

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments