వీకెండ్ స్పెషల్: సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచే ప్రాన్స్ రిసిపీ!

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (18:11 IST)
సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎముకలను దృఢంగా చేసే రొయ్యలతో మసాలా రిసిపీని ఈ వీకెండ్ ట్రై  చేయండి. రొయ్యల్లో క్యాల్షియం, లో కెలెరోలు, యావరేజ్ కొలెస్ట్రాల్, ఫాస్పరస్, కాపర్, మేగ్నిషియం ఉన్నాయి. 
 
కావల్సిన పదార్థాలు: 
ప్రాన్స్: ఒక కేజీ 
ఉల్లిపాయ తరుగు: ఒక కప్పు 
టమోటో తరుగు :  ఒక కప్పు 
కొత్తిమీర తరుగు :  పావు కప్పు 
వెల్లుల్లి పేస్ట్ : నాలుగు టీ స్పూన్లు 
పసుపు : ఒక టీ స్పూన్ 
చింతపండు: ఒక టీ స్పూన్ 
కారం: ఒక టీ స్పూన్ 
లవంగాలు: రెండు
దాల్చిన చెక్క: అర టీ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత
 
తయారీ విధానం:
 
ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలకు వెల్లుల్లి, పసుపు, కారం, చింతపండు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 15-30నిముషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఒకనిముషం వేగించుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 5నిముషాల తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.
 
అందులోనే టమోటో ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి, 5నిముషాలు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. ప్రాన్స్ ష్రింక్ అయ్యే వరకూ ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వుతున్న సాస్ నుండి ఆయిల్ విడిపోవడాన్ని గమనించండి.
 
అందులోనే కొత్తిమీర తరుగు చేర్చి ఉడికించుకోవాలి. అంతే రొయ్యలతో మసాలా రిసిపీ రెడీ. ఈ గ్రేవీలా ఉండే రిసిపీ రైస్‌కు గుడ్ కాంబినేషన్.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అసెంబ్లీకి రాకుండా నెలవారీ జీతాలు తీసుకుంటే ఎలా.. అయ్యన్న పాత్రుడు ప్రశ్న

రాజ్యసభకు ఆర్ఆర్ఆర్.. జూన్ నాటికి ఆ నాలుగు స్థానాలు ఖాళీ

స్పేస్‌కు వీడ్కోలు చెప్పిన సునీత విలియమ్స్.. నాసాకు బైబై.. 62 గంటల 6 నిమిషాలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

పి.వి.నరసింహారావు రాసిన కథ ఆధారంగా గొల్ల రామవ్వ రాబోతోంది