పాలకూర, క్యాప్సికమ్ ఆమ్లెట్ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 24 జూన్ 2015 (16:50 IST)
పాలకూర చర్మ, కేశ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలకూరను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్‌ను క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. కెలోరీలను బర్న్ చేస్తుంది. పెయిన్ రిలీఫ్‌గా పనిచేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్‌లో సింపుల్‌గా పాలకూర, క్యాప్సికమ్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలకూర తరుగు - ఒక కప్పు 
క్యాప్సికమ్ తరుగు - ఒక కప్పు 
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి  తరుగు - ఒక టీ స్పూన్ 
గరం మసాలా - అర టీ స్పూన్ 
కోడిగుడ్లు - మూడు 
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్ 
నూనె - తగినంత 
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం : 
ముందుగా పాలకూర, క్యాప్సికమ్, ఉల్లి, పచ్చిమిర్చి తరుగును ఓ బౌల్‌లోకి తీసుకుని కోడిగుడ్డును చేర్చి గిలకొట్టాలి. ఇందులో ఉప్పు, అల్లం పేస్టు, గరం మసాలా కూడా చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టౌమీద పాన్ పెట్టి వేడయ్యాక కోడిగుడ్డు పాలక్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకుని.. ఇరువైపులా బ్రౌన్ కలర్‌ అయ్యేంతవరకు కాల్చుకుని సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. ఈ ఆమ్లెట్‌పై తరిగిన చీజ్ చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

భర్తకున్న అక్రమ సంబంధం తెగిపోవాలి.. ఎల్లమ్మ ఆలయంలో భార్య పూజలు (video)

ఛీ.. ఛీ.. యాక్, ఈ బిస్కెట్లు ఎట్లా తింటున్నారు, నేలకేసి కొడుతున్న కోతులు, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Varma: పదహారేళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర

Show comments