మీట్ బాల్స్ నూడిల్స్ ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (16:26 IST)
మటన్‌‍లో బీ గ్రూప్ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ కె. ప్రోటీన్స్, నేచురల్ ఫ్యాట్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. అలాంటి మటన్ మీట్‌తో టేస్టీ నూడిల్స్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మటన్ - పావు కేజీ 
ఆలివ్ ఆయిల్ - రెండు టీ స్పూన్లు 
ఉడికించిన నూడిల్స్ - ఒక కప్పు 
జీలకర్ర - అర టీ స్పూన్ 
పచ్చిమిర్చి తరుగు- ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి అల్లం పేస్ట్ - రెండు టీ స్పూన్లు
ఆవాలు - అర టీ స్పూన్
మిరియాల పొడి - కొద్దిగా 
చీజ్ - టేబుల్ స్పూన్ 
బేసిల్ ఆకులు - 10 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
మటన్‌కి కొద్దిగా ఉప్పు జత చేసి ఉడికించాలి. వీటిని ఉండలుగా చేసి నూనెలో గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లి తరుగు, టొమాటా తరుగు జత చేయాలి. టొమాటా ముక్కలు మెత్తబడ్డాక ఉడికించిన న్యూడిల్స్ చేర్చి.. మీట్ బాల్స్, ఉప్పు వేసి కలపాలి. తర్వాత చీజ్ వేసి బాగా కలపాలి. మిరియాల పొడి చల్లి మరోసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?

భోజ్‌పూర్‌లో యువకుడు ఎన్‌కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు

సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Show comments