Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ టిక్కా తయారీ విధానం...

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (11:18 IST)
చికెన్‌లోని విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. చాలామంది చికెన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తుంటారు. కానీ, అలా కాదు.. చికెన్‌లో గల న్యూట్రిషన్స్ వేరే పదార్థాలలో లభించవు. కనుక ఆహారంలో చికెన్ చేర్చుకోవడం మంచిదని నిపుణులు మాట. అయితే రోజూ చికెన్ కూరలే చేయలేం. కాబట్టి చికెన్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
చికెన్ - 500 గ్రా
బాదం పప్పు - 30 గ్రా
క్రీమ్ - 10 గ్రా
చీజ్ - 10 గ్రా
గట్టి పెరుగు - 50 గ్రా
పచ్చిమిర్చి - 25 గ్రా
యాలకుల పౌడర్ - 1 స్పూన్
మిరియాల పొడి - 1 స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
నెయ్యి - 2 స్పూన్స్
చాట్ మసాలా - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాదం పప్పులను నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చినీ మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో క్రీమ్, చీజ్ వేసి అందులో పెరుగు, బాదం పేస్ట్, యాలుకల పౌడర్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఆ మిశ్రమంలో కలిపి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత తందూరీలో కుక్ చేసుకోవాలి. ఇలా చేయలేని వాళ్లు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక చికెన్ ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు. చివరగా నెయ్యి, చాట్ మసాల్ వేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ చికెన్ టిక్కా రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments