చేపల ఇగురు తయారీ విధానం...

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (12:55 IST)
కావలసినవి:
 
చేపలు - అరకేజీ
 
ఉల్లిపాయలు - నాలుగు
 
పచ్చిమిర్చి - నాలుగు
 
కారం - రెండు టీస్పూన్లు
 
జీలకర్ర పొడి - టీస్పూన్
 
ధనియాల పొడి - ఒక టీస్పూన్
 
పసుపు - టీస్పూన్
 
టొమాటో - ఒకటి
 
అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్
 
కొత్తమీర - కట్ట
 
నూనె - తగినంత
 
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
 
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి, అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక చేప ముక్కలు వేసుకుని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరి కాసేపు వేగించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మరి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా తింటే చేపల ఇగురు టేస్ట్ సూపర్బ్‌‌‌గా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments