Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవెనింగ్ స్పెషల్ ఎగ్ - పటోటా కర్రీ

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (17:54 IST)
కావల్సిన పదార్థాలు: 
గుడ్లు - 3 లేక 4
బంగాళదుంపలు -  2 (కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు - 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటోలు - 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి - 3 లేక 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు పాయలు
కారం - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా పౌడర్ - ఒక టేబుల్ స్పూన్
పసుపు -  1/4 టీ స్పూన్
ధనియాలపొడి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
 
తయారుచేయు చేయండి ఇలా :
మొదట గుడ్లను బంగాళదుంపలను ఉడికించుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మరియు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
 
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు వేసి మరో  ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి.
 
తర్వాత అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలకు, గుడ్లకు పొట్టు తేసేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. వీటితో పాటు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాలపొడి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. 
 
ఇలా ఫ్రై చేస్తూనే సరిపడా నీళ్ళు, రుచికి సరిపడా ఉప్పు వేసి, మూత పెట్టాలి చివరిగా 10నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే ఈవెనింగ్ స్పెషల్ ఎగ్ - పటోటా కర్రీ రెడీ. దీనిని చపాతీ, పూరి, పరాటా, దోస ఇడ్లీ అంటూ దేనికైనా సైడిష్‌గా వాడుకోవచ్చు.

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments