Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోటీలకు గుడ్ కాంబినేషన్ ఎగ్ పొటాటో కర్రీ

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2015 (18:28 IST)
రోటీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అలాగే కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన పోషకాహారం లభించినట్లవుతుంది. ఈ రెండూ కాంబినేషన్‌లో రోటీలకు గుడ్ కాంబినేషన్ ఎగ్ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు : అర డజను 
ఉడికించిన పొటాటో : ఒక కప్పు 
నూనె, ఉప్పు : తగినంత 
గ్రీన్ చిల్లీ: రెండు స్పూన్లు 
ఉల్లి తరుగు : అర కప్పు 
పసుపు పొడి : చిటికెడు
అల్లు వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు : పావు కప్పు 
టమోటా తరుగు : అరకప్పు 
గరం మసాలా, కారం : తగినంత 
 
తయారీ విధానం:
బాణలి వేడయ్యాక నూనె పోసి వేడయ్యాక అందులో పొటాటో ముక్కలను వేయాలి. కాసేపయ్యాక ఉడికించిన కోడిగుడ్లను వేసి కాసేపు వేయించాలి. వీటిని వేరొక ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత అదే బాణలిలో నూనె పోసి ఆవాలు వేసి, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేపుకోవాలి. బాగా వేగాక కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.

టమోటాలను కూడా వేపుకోవాలి. ఇందులోనే కొత్తిమీర తరుగును చేర్చి మిశ్రమం బాగా ఉడికాక.. నీరు పోసి గ్రేవి తగ్గట్టు మరగనివ్వాలి. తర్వాత వేపుకుని పక్కనబెట్టుకుని కోడిగుడ్డు, పొటాటో ముక్కల్ని చేర్చి.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని దించేయాలి. అంతే ఎగ్ పొటాటో కర్రీ రెడీ.. వేడి వేడి రోటీలకు చట్నీగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments