ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలి?

Webdunia
శుక్రవారం, 13 జూన్ 2014 (14:11 IST)
కోడిగుడ్డును రోజుకొకటి తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలకు కోడిగుడ్డును ఇవ్వడం ద్వారా పెరుగుదలకు తగిన పోషకాలు అందుతాయి. అలాంటి కోడిగుడ్డుతో ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
కోడిగుడ్లు - 4
ఉల్లి తరుగు - అర కప్పు 
టమోటా తరుగు - అర కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ 
పచ్చి మిర్చి - నాలుగు
కొబ్బరి తురుము - పావు కప్పు 
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్ 
మిరియాలు - ఒక టేబుల్ స్పూన్ 
పసుపు - పావు టీ స్పూన్ 
కారం - రెండు టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - 3 టీ స్పూన్లు 
దాల్చిన చెక్క - 2
ఉప్పు, నూనె - తగినంత  
 
ముందుగా ఒక పాత్రలో నాలుగు కోడిగుడ్లను కొట్టి పోసి అందులో సగం ఉల్లి తరుగు వేయాలి. పసుపు, పచ్చి మిర్చి ఉప్పు చేర్చి బాగా గిలకొట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా పోసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి, జీలకర్ర, మిరియాలు బాగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక దాల్చిన చెక్క, సోపు గింజలు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చి దోరగా వేపుకోవాలి. తర్వాత టమోటా చేర్చాలి.

బాగా వేగాక పసుపు పొడి, మిరిపపొడి, ధనియాల పొడి చేర్చి వేపాలి. కావలసినంత నీరు పోసి కాసేపు తెల్లనివ్వాలి. బాగా తెల్లాక రుబ్బిన కొబ్బరిని చేర్చి కాసేపు తెల్లనివ్వాలి. దించేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను కూరలో చేర్చుకోవాలి. ఈ కూరలో కావాలంటే నిమ్మరసం లేదా ఒక టేబుల్ స్పూన్ చింతపండు జ్యూస్‌ను చేర్చుకోవచ్చు. ఈ గ్రేవీని కొత్తిమీర, కరివేపాకు గార్నిష్‌తో దోసె, రైస్‌కు సైడిష్ సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

Show comments