దోసకాయ రొయ్యల కూర ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 25 మే 2019 (12:46 IST)
దోసకాయలో నీటి శాతం ఎక్కువగా వుంది. దోసకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వేసవిలో డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి దోసకాయతో.. క్యాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా వుండే సీ ఫుడ్ రొయ్యలతో దోసకాయ రొయ్యల గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
దోసకాయ తరుగు - రెండు కప్పులు 
రొయ్యలు - పావు కేజీ 
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు 
కారం - రెండు స్పూన్లు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు రెండు, లవంగాలు రెండు, సోంపు అరస్పూన్ వేసి.. వేగాక రొయ్యల్ని వేసి వేపుకోవాలి. ఎర్రగ వేగిన తర్వాత దోసకాయ ముక్కలు చేర్చాలి. అర స్పూన్ పసుపు పొడి చేర్చాలి. ఇందులో ఉల్లి తరుగు చేర్చి.. ఈ మిశ్రమం బాగా మిక్స్ అయ్యాక కారం, ఉప్పు, నీరు తగినంత చేర్చి.. రొయ్యల్ని బాగా వేయించాలి. 
 
రొయ్యలు బాగా ఉడికాక.. గ్రేవీ వరకు వచ్చేలా స్టౌ మీద వుంచి దించేయాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే దోసకాయ రొయ్యల గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే బాగుంటుంది. ఈ గ్రేవీని రోటీలకు, దోసెలకు కూడా సైడిష్‌గా వాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో చేరిన కాంగ్రెస్ - విజయ్ కేబిటెన్‌లో మంత్రిపదవులు

59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు కేబినేట్‌లో కాంగ్రెస్ పార్టీ

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి.. సీఎం రేవంత్ రెడ్డి

కాక్రోచ్ జనతా పార్టీకి విశేష స్పందన... ఇన్‌స్టాలో 66 లక్షల పైగా ఫాలోవర్లు

ప్రధాని మోదీ ఇటలీ పర్యటన విజయవంతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments