కొత్తిమీరతో రొయ్యల ఫ్రై ఎలా చేయాలి?

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2015 (18:37 IST)
కొత్తిమీరలో యాంటి ఆక్సిడెంట్లు సమృద్దిగా లభిస్తాయి. కొత్తిమీరలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తికి ఎంతో సాయపడతాయి. అలాంటి హెల్దీ కొత్తిమీరతో రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
పసుపు, ఉప్పు, పసుపుతో ఉడికించిన రొయ్యలు - అర కేజీ 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావు కప్పు 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు 
టొమాటో సాస్ - పావు కప్పు 
కరివేపాకు - కాసింత 
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు 
కారం - రెండు టీ స్పూన్లు 
పసుపు పొడి - చిటికెడు 
ఉప్పు, నూనె, గరం మసాలా - తగినంత  
 
తయారీ విధానం : 
బాణలిలో నూనెను వేడిచేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన రొయ్యలు, పసుపు వేసి కాసేపు ఉడికించాలి. తర్వాత కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, కొత్తిమీర వేసి కాసింత నీటితో దోరగా వేపాలి. చివర్లో టమోటా సాస్, వెల్లుల్లి రెబ్బలు వేసి పది నిమిషాల పాటు ఉంచి రొయ్యల బాగా ఫ్రై అయ్యాక దించేస్తే కొత్తిమీర రొయ్యల ఫ్రై రెడీ అయినట్లే. ఈ ఫ్రైని అన్నంలోకి సైడిష్‌గా నంజుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్.. గంజాయి స్మగ్లర్ల దాడి.. పరిస్థితి విషమం

రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు.. ఏం జరిగిందంటే?

అమరావతిలో చంద్రబాబు, పవన్.. 301 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు

Royal Sikh: రాజసం ఉట్టిపడే తలపాగాతో కనిపించిన పవన్ కల్యాణ్

గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహించాలి.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

Show comments