Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ అండ్ టేస్టీ.. చుక్కకూరతో మటన్ కర్రీ ట్రై చేయండి.

Webdunia
గురువారం, 3 జులై 2014 (14:52 IST)
చుక్కకూర పైత్యం రోగాలను నయం చేస్తుంది. చుక్కకూర ఆకురసం చిటికెడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపునొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాంటి చుక్కకూరతో టేస్టీ అండ్ హెల్దీ మటన్ కర్రీ ట్రై చేస్తే ఎలా వుంటుందో చూద్దామా?
 
కావలసిన పదార్థాలు :
మటన్.. ఒక కేజీ
నూనె.. తగినంత
ఉల్లిపాయలు.. ఎనిమిది
చుక్కకూర.. రెండు కట్టలు
పచ్చిమిర్చి.. ఎనిమిది
యాలకులు.. నాలుగు
లవంగాలు.. ఐదు 
దాల్చిన చెక్క.. మూడు
అల్లం.. కాస్తంత
వెల్లుల్లి.. 14 రేకలు
పసుపు, ఉప్పు, కారం.. తగినంత
ధనియాలు.. తగినన్ని
కొత్తిమీర.. 3 పెద్ద కట్టలు
 
తయారీ విధానం :
ముందుగా మటన్‌‌ను శుభ్రంగా కడిగి, కావాల్సిన సైజులో కోసుకోవాలి. యాలకులు, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్కలను కలిపి మెత్తగా నూరుకోవాలి. మటన్‌ను సన్నగా తరిగి ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా కోసుకోవాలి. అల్లం, వెల్లుల్లిలను మెత్తగా నూరి ఉంచాలి. ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి.
 
అందులో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను.. ఉప్పు, కారం, పసుపులను వేసి బాగా కలియబెట్టి నీళ్లుపోసి ఉడికించాలి. మాంసం బాగా మెత్తబడేలా ఉడికిన తరువాత పైన చుక్కకూరను చల్లి, బాగా కలిపి ఉడికిన తరువాత దించేయాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే చుక్కకూరతో మటన్ కర్రీ తయార్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments