Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ విత్ మష్రూమ్స్ రిసిపీ ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:42 IST)
మధుమేహాన్ని నియంత్రించే మష్రూమ్‌తో టేస్టీ చికెన్ రిసిపి ఈ వీకెండ్ ట్రై చేయండి. ఎలా చేయాలంటే?
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - అర కేజీ 
మష్రూమ్ -  పావు కేజీ 
మైదా - ఒక కప్పు 
ఉప్పు - తగినంత 
మిరియాల పొడి - ఒక స్పూన్ 
నూనె - తగినంత 
బంగాళా దుంప- అర కప్పు 
వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు  
ఉల్లి ముక్కలు -  ఒక కప్పు 
చికెన్ స్టాక్ - కొంత 
గరం మసాలా పౌడర్ - కాసింత 
వెనిగర్ - కాసింత 
సోయా సాస్ - కాసింత 
టమోటా- కెచప్
 
తయారీ విధానం :
ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా, ఉప్పు, మిరియాల పొడిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన చికెన్ ముక్కల్ని కలుపుకోవాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక చికెన్ ముక్కల్ని దోరగా ఇరువైపులా వేయించుకుని పక్కన బెట్టుకోవాలి. అదే నూనెలో బంగాళాదుంపలు, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఉల్లి ముక్కలు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

ఇందులో మష్రూమ్, మిరియాల పొడి, చికెన్ స్టార్, వెనిగర్, గరం మసాలాను కలుపుకోవాలి. ఇందులోనే సోయా సాస్, టమోటా కెచప్, తర్వాత వేయించిన చికెన్ ముక్కల్ని చేర్చి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు చికెన్ ముక్కలకు సాస్, మసాలా పట్టేంతవరకు ఉంచి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రిసిపి రోటీ, రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments