చికెన్ మేక్రోని ఎలా చేయాలో చూద్దాం..!

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (17:53 IST)
చికెన్‌లో హై ప్రోటీనులు ఉంటాయి. ఇవి కండరాలను బలపరచడంతో పాటు బరువును నియంత్రిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఎ దృష్టిలోపాలను దూరం చేస్తుంది. అలాంటి చికెన్‌తో మేక్రోనీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు : 
బోన్ లెస్ చికెన్ - అర కేజీ 
మేక్రోని -200 గ్రాములు 
నూనె - ఒక స్పూన్ 
వెన్న - ఒక స్పూన్ 
కొత్తిమీర - అర కట్ట 
కాప్సికం- కట్ట 
టమోటా తరుగు- ఒక కప్పు 
నెయ్యి - నాలుగు స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు 
మిరియాల పొడి- అర స్పూన్
 
తయారీ విధానం : 
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని మూకుడులో ఉడికించాలి. దీనిలో పచ్చి మిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర, క్యాప్సికం, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. మరో మూకుడులో మేక్రోనిని బాగా ఉడకబెట్టాలి.

ఒక గిన్నెలో కోడిగుడ్లు సొన, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమంపై మేక్రోనిని వేసి దానిపై కోడిగుడ్డు మిశ్రమాన్ని వేయాలి. దీనిని ఒక 20 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఈ చికెన్ మేక్రోనిని చపాతీలకు, రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

Show comments