Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ హాట్‌గా... స్పైసి చికెన్ బిట్స్

Webdunia
గురువారం, 4 డిశెంబరు 2014 (16:57 IST)
కావల్సిన పదార్థాలు : 
బోన్‌లెస్ (ఎముకలు లేని చికెన్) - 300 గ్రాములు (ముక్కలుగా చేసుకోవాలి)
గుడ్డు - ఒకటి 
మొక్కజొన్న పిండి - ఒక టేబుల్ స్పూన్
మైదా - అర టేబుల్ స్పూన్
ధనియాలపొడి -  అర టేబుల్ స్పూన్
జీలకర్రపొడి - అర టేబుల్ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
మిరియాలపొడి - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి ముక్కలు - ఒక టీ స్పూన్
ఉల్లికాడల తరుగు - ఒక కప్
పచ్చిమిర్చి ముక్కలు - ఒక టీస్పూన్
నూనె -  వేయించడానికి సరిపడా
టమోటో కెచప్: అర కప్
నీళ్ళు: ఒక కప్
ఉప్పు: తగినంత
 
తయారుచేయు విధానం: 
మొదట ఓ గిన్నెలో మాంసం ముక్కలు, గుడ్డుసొన, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు తీసుకుని బాగా కలపాలి. తర్వాత పది నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. 
 
ఇప్పుడు పాన్‌లో నూనె తీసుకుని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. తర్వాత మరో బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక.. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత టమోటో కెచప్, ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి. 
 
అప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లి వేయించి రెండు, మూడు నిమషాల తర్వాత దింపేస్తే సరిపోతుంది. దీనిని శీతాకాలంలో సాయంత్రం పూట చేసుకుని వేడి వేడిగా అలాగే ఆరగించవచ్చు. లేదా చపాతిలోకి సైడ్ డిష్‌గానో లేక రాత్రి భోజనం లోకి సైడ్ డిష్‌గానైనా ఆరగించవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments