వీకెండ్ స్పెషల్ - స్పైసీ చిక్కెన్ చిల్లీ బైట్స్

Webdunia
శనివారం, 10 జనవరి 2015 (13:57 IST)
కావల్సిన పదార్థాలు:  
ఎముకల్లేని చికెన్ - 300 గ్రాములు (ముక్కలుగా చేసుకోవాలి)
గుడ్డు -  ఒకటి
మొక్కజొన్న పిండి - ఒక టేబుల్  స్పూన్
మైదా -  అర టేబుల్ స్పూన్
ధనియాలపొడి - అర టేబుల్ స్పూన్ 
జీలకర్రపొడి - అర టేబుల్ స్పూన్
కారం - ఒక టీస్పూన్ 
మిరియాలపొడి - అర టీస్పూన్ 
గరం మసాలా - అర టీస్పూన్
నూనె - ఫ్రై చేయడానికి తగినంత 
అల్లం, వెల్లుల్లి ముక్కలు - ఒక టీస్పూన్ 
ఉల్లికాడల తరుగు - ఒక కప్పు 
పచ్చిమిరప ముక్కలు - ఒక టీస్పూన్ 
టమోటో  గుజ్జు - అర కప్పు 
నీళ్ళు - ఒక కప్పు 
ఉప్పు - తగినంత 
 
ఇలా తయారు చేయండి:
మొదట ఒక పాత్రలో మాంసం ముక్కలు, గుడ్డుసొన, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా, మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు వేసుకుని, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోపాలి. ఇప్పుడు పాన్ లో నూనె పోసి బాగా కాగని తర్వాత ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.  తర్వాత మరో బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి. రెండు మూడు నిమిషాల తర్వాత టమోటో గుజ్జు, ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. కొద్దిగా నీళ్ళు చల్లి వేయించి రెండు, మూడు నిమషాల తర్వాత దింపేస్తే సరిపోతుంది. అంతే నోరూరించే స్పైసీ చిక్కెన్ చిల్లీ బైట్స్ రెడీ. 
గమనిక : కారం తగ్గించాలనుకుంటే ఇందులో వేసే కారం పొడి, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడిని కాస్త తగ్గించుకుని వేసుకోవాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త కుటుంబం వేధింపులు.. కట్టుకున్న వాడితో గొడవలు.. కన్నబిడ్డలతో వివాహిత ఆత్మహత్య

ఏమండీ... మన అబ్బాయిని నేనే చంపేసానంటూ భర్త వద్ద బావురుమంది

Hyderabad: నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని చెప్పి.. సామూహిక అత్యాచారం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హాజరైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు

Republic Day: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10,000 మంది ప్రత్యేక అతిథులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాన్ సిటీ టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన లోకేష్ కనకరాజ్

NTR: కుల వివ‌క్ష‌ను ప్ర‌శ్నిస్తూ దండోరా తీసినందుకు అభినందించిన ఎన్టీఆర్‌

న్యూయార్క్‌లో ది స్టోరీటెల్లర్ యూనివర్స్ ఫిల్మ్ ఫెస్టివల్

Asin: పదేళ్లు గడిచాయి.. అద్భుత భాగస్వామితో మా ప్రయాణం అదుర్స్.. అసిన్

Rashmi Gautam: కల్చర్ మరిచిపోయారు.. ఆవు, కుక్కలకు అన్నం పెట్టలేదా?

Show comments