Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగ్గుబియ్యంతో చికెన్ అండ్ ఎగ్ దోసె ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (16:22 IST)
సగ్గుబియ్యం-చికెన్- ఎగ్ ఈ మూడింటి కాంబినేషన్‌లో వెరైటీ దోసె ఎలా చేయాలో చూద్దాం. కోడిగుడ్డులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. సగ్గుబియ్యం జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. చికెన్ కండరాల పుష్టికి తోడ్పడుతుంది. ఈ మూడింటి కాంబినేషన్‌లో టేస్టీ దోసె ఎలా చేయాలో చూద్దాం..!
 
కావలసిన పదార్థాలు:
ఉడికించిన చికెన్ ముక్కలు : రెండు కప్పులు 
కోడిగుడ్లు : రెండు
ఉల్లి తరుగు : ఒక కప్పు 
కొత్తిమీర తరుగు : పావు కప్పు
ఉప్పు తగినంత : 
దోసె పిండి : తగినంత 
గ్రీన్ చిల్లీస్ : తగినంత 
సగ్గుబియ్యం : ఒక కప్పు  
 
తయారీ విధానం : 
ముందుగా వెడల్పాటి పాన్‌లో కోడిగుడ్డు పగులకొట్టి.. అందులో ఉల్లి, కొత్తిమీర ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు బాగా గిలకొట్టాలి. ఇందులోని చికెన్ ముక్కల్ని కలుపుకోవాలి. కోడిగుడ్డు మిశ్రమంలో చికెన్ ముక్కలు.. నానబెట్టి ఉడికించిన సగ్గుబియ్యం, తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టౌ మీద దోసె పెనం పెట్టి వేడయ్యాక దోసె పిండి పోసి దానిపై కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి.. దానిపై మరో దోసెతో మూతపెట్టి.. లోపలి మిశ్రమం ఉడికేంత వరకు ఉంచాలి. అంతే చికెన్-ఎగ్-సగ్గుబియ్యం దోసె రెడీ. దీనికి గ్రీన్ చట్నీ చేర్చి హాట్ హాట్‌గా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

జమ్మూకాశ్మీర్‌‌లో భారీ వర్షాలు.. ఇంటర్నెట్ బంద్- వైష్ణోదేవి యాత్రకు అంతరాయం

అమెరికన్ సంస్థ జీఈతో భారత్ డీల్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం సంతకానికి రెడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

Show comments