కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించే మటన్: వెరైటీ ఫ్రై ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (18:19 IST)
కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రించేందుకు మటన్ తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మటన్‌ను వారానికి ఒక్కసారి లేదా మాసానికి రెండు సార్లు తీసుకోవడం మంచిది. పిల్లలకు, గర్భిణీ మహిళలకు మటన్ ఎంతో మేలు చేస్తుంది. గర్భంగా ఉన్న మహిళలు మటన్ తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చు. తల్లితో పాటు గర్భస్థ శిశువుకు సైతం మటన్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. సాధారణంగా వంద గ్రాముల మటన్‌లో 3మి.గ్రాముల ఐరన్ ఉంటుంది. అలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగివున్న మటన్‌తో వెరైటీగా ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్‌ మటన్‌ - అరకేజీ 
తరిగిన ఉల్లిపాయలు - ఒక కప్పు 
అల్లం వెల్లల్లి పేస్టు - రెండు టేబుల్‌ స్పూన్లు
కారం - ఒక టీ స్పూను
ఉప్పు - సరిపడా
పసుపు - పావు టీ స్పూన్‌
 
మసాలా కోసం.. 
నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌
నిమ్మరసం - రెండు టీ స్పూన్లు
కారం - ఒక టీ స్పూను
ఉప్పు - సరిపడా
పసుపు - పావు టీ స్పూన్‌
 
తయారీ విధానం : 
ముందుగా బోన్ లెస్ మటన్ ముక్కలు, ఉల్లి తరుగు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిసి సరిపడా నీటితో కుక్కర్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికాక మటన్ ముక్కల్ని ప్లేటులోకి తీసిపెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి దానిపై బాణలి ఉంచి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి. బాగా వేగా.. ప్లేటులోకి తీసుకున్న మటన్ ముక్కల్ని చేర్చి కలియబెట్టారు. ఇదే మిశ్రమంపై మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి మరో పది నిమిషాల పాటు సన్నటి సెగపై ఉడికించాలి. ముక్కలు బాగా వేగాక దించేయాలి. అంతే బోన్ లెస్ మటన్ ఫ్రై రెడీ అయినట్టే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజ్యసభకు ఆర్ఆర్ఆర్.. జూన్ నాటికి ఆ నాలుగు స్థానాలు ఖాళీ

స్పేస్‌కు వీడ్కోలు చెప్పిన సునీత విలియమ్స్.. నాసాకు బైబై.. 62 గంటల 6 నిమిషాలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

రెండేళ్లలో 416మందితో డేటింగ్.. మహిళ షాకింగ్ స్టోరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

పి.వి.నరసింహారావు రాసిన కథ ఆధారంగా గొల్ల రామవ్వ రాబోతోంది

Chandrabose: ఉస్తాద్ భగత్ సింగ్ లో బ్యాక్ గ్రౌండ్ గీతాన్ని కసరత్తు చేస్తున్న చంద్రబోస్

కన్నె పిట్టారో.. పాట పాడుతూ డెకాయిట్ పూర్తిచేశానన్న మృణాల్ ఠాకూర్

Show comments