Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో నోరూరించే బాదం చికెన్ గ్రేవీ ఎలా చేయాలి?

ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, వెల్లుల్లి ముద్ద పట్టించి అరగంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక ఉల్లిముక్కలు, పసుపు వేసి చల్లారాక వీటికి పచ్చిమిర

Webdunia
గురువారం, 13 జులై 2017 (15:53 IST)
చికెన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. వర్షాకాలంలో చికెన్‌ను మితంగా తీసుకోవాలి. కండరాల పుష్టికి బరువు నియంత్రించేందుకు చికెన్‌ను మాసానికి రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి. అలాగే బాదం పప్పు కూడా మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందింపజేస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా చేస్తుంది. ఈ రెండింటి కాంబోలో బాదం చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
వివరాల్లోకి వెళితే.. 
చికెన్‌: అరకిలో, 
బాదంపొడి: ఒకటిన్నర స్పూను,
ఉల్లి తరుగు: పావు కప్పు, 
పసుపు: అరటీస్పూను, 
నిమ్మరసం: టేబుల్‌స్పూను,
మిరియాలపొడి: అరటీస్పూను, 
వెల్లుల్లిముద్ద: టీస్పూను, 
నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, 
పెరుగు: అర కప్పు,
పచ్చిమిర్చి తరుగు : పావు కప్పు
యాలకులు: నాలుగు, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క తాలింపుకు తగినంత 
బాదంముక్కలు: అరటీస్పూను, 
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, వెల్లుల్లి ముద్ద పట్టించి అరగంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక ఉల్లిముక్కలు, పసుపు వేసి చల్లారాక వీటికి పచ్చిమిర్చి చేర్చి ముద్దలా చేయాలి. ఈ ముద్దను చికెన్‌ ముక్కలకు పట్టించాలి. పెరుగులో బాదంపొడి, ధనియాలపొడి కలిపి, ఈ మిశ్రమాన్ని కూడా చికెన్‌ ముక్కలకు పట్టించాలి.
 
మరో పాన్‌లో నెయ్యి వేసి వేయించాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావు ఆకులు వేసి వేపాలి. ఆపై నానబెట్టిన చికెన్‌ ముక్కల మిశ్రమాన్ని వేసి మూతపెట్టి మధ్య మధ్యలో కదుపుతూ సిమ్‌లో ఉడికించాలి. చికెన్ ఉడికాక దించేసి బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

తర్వాతి కథనం
Show comments