హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. ఆలూ ఎగ్ ఆమ్లెట్ టేస్ట్ చేస్తే..

Webdunia
మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (17:37 IST)
ఆఫీసుకు హడావుడిగా వెళ్తున్నారా... టిఫిన్ తినడానికి టైమ్ లేదా.. ఒక్క ఆమ్లెట్ మాత్రం తినండి. లేదా ఆలూ ఆమ్లెట్‌కు ముందు రోజే వెజ్ కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచి.. మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని తీసుకోండి. ఇది హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌కు తగినన్ని క్యాలరీలను శరీరానికి అందిస్తుంది. డైట్‌ను పాటించే వాళ్ళు పచ్చసొన ఫాట్, కొలెస్ట్రాల్ శాతం అధికం అనుకొనే వాళ్ళు ఎగ్ వైట్‌తో ఆమ్లెట్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
 
అయితే మరింత టేస్టీగా మరిన్ని పోషకాలు, క్యాలరీలు శరీరానికి అందివ్వాలంటే అందులో ఆలూ కూడా జత చేసి ఆమ్లెట్ తయారు చేసుకొని తినొచ్చు. ఇది పిల్లలకూ పెద్దలకూ మంచి పౌష్టికాహారం. అల్పాహారం.
 
కావలసిన పదార్థాలు: 
ఆలుగడ్డలు:  అర కేజీ 
కోడి గుడ్లు: ఆరు
ఉప్పు: రుచికి తగినంత
వెన్న: రెండు స్పూన్లు 
పాలు: రెండు టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయలు తరుగు : అర కప్పు 
మిరియాలపొడి: అర టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం : 
ఒక గిన్నెలో కోడిగుడ్ల పగులకొట్టి గిలకొట్టుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, వెన్న, ఉల్లి ముక్కలు, పాలు వేసి మళ్లీ బాగా గిలకొట్టాలి. చివరిగా ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని వేసి బాగా కలిపి పెనంపై ఆమ్లెట్‌పై వేసుకున్నా బాగుంటుంది. దీనిని బ్రేక్ ఫాస్ట్ గానూ.. సైడిష్ గానూ ఉపయోగించుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

Show comments