Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత అంటే నాకు చాలా ఇష్టం.. తొలిసారి కలిశాను.. సీఎం హోదాలో అందంగా?: కట్జూ

దివంగత సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. ఆమెపై ఉన్న ఆసక్తిని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన జస్టిస్ మార్కండేయ కట్జూ.. ఆమె మరణానికి అనంతరం తన మనసులోని మాటను ఎలాంటి జంకుబొంకు లేకుండా

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (18:23 IST)
దివంగత సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. ఆమెపై ఉన్న ఆసక్తిని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన జస్టిస్ మార్కండేయ కట్జూ.. ఆమె మరణానికి అనంతరం తన మనసులోని మాటను ఎలాంటి జంకుబొంకు లేకుండా చెప్పేశారు. తాజాగా జయలలిత పక్కన తాను కూర్చున్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టి.. ఇద్దరు పులులంటూ కామెంట్‌ చేశారు కట్జూ. జయలలిత మీద అపారమైన గౌరవాన్ని చూపెట్టిన కట్జూ.. తాను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే పడిచచ్చేవాడినంటూ ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. 
 
తాను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమె అందానికి తాను ఆకర్షితుడిని అయ్యానని.. అయితే ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేదని కట్జూ అన్నారు. తాను 1946లో పుట్టాను. ఆమె 1948లో పుట్టిందని ఆనాటి జ్ఞాపకాలను కట్జూ గుర్తు చేసుకున్నారు.
 
2004 నవంబర్‌లో చెన్నై రాజ్‌భవన్‌లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా తన ప్రమాణం సందర్భంగా ఆమెను తొలిసారిగా కలిశానని.. అప్పట్లో సీఎంగా.. జయలలిత అందంగా కనిపించిందని కట్జూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జయలలిత సినిమా పాటను కూడా షేర్‌ చేశారు. తనలో ఆమెపట్ల ఉన్న గౌరవం, ప్రేమను ఆమెతో చెప్పిన దాఖలాలు లేవని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments