జొమాటో డెలివరీ బాయ్ అతి తెలివి.. సంస్థకు కుచ్చుటోపీ... స్పందించిన సీఈవో

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (16:22 IST)
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లలో జొమాటో ఒకటి. ఇందులో అనేక మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారు. వీరిలో కొందరు తమ అతి తెలివిని ఉపయోగించి సంస్థకు కుచ్చు టోపీ పెడుతున్నారు. ఈ విషయాన్ని ఓ యువ పారిశ్రామికవేత్త బహిర్గతం చేశాడు. దీంతో జొమాటో సీఈవో కూడా స్పందించారు. సంస్థలో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సరిచేస్తున్నట్టు చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వినయ్ సతి అనే యువ పారిశ్రామికవేత్త కొన్ని రోజుల క్రితం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు. పిమ్మట 40-50 నిమిషాలకు డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొచ్చాడు. ఆ సమయంలో వినయ్‌తో ఫుడ్ డెలివరీ బాయ్ మాట్లాడుతూ.. సర్.. మీరు ఇకపై ఫుడ్ ఆర్డర్ చేసేటుపుడు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించకండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల మీరు రూ.800 విలువ చేసే ఫుడ్‌ను సీవోడీ ఆప్షన్ ఎంచుకోండి. 
 
ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత మీరు నాకు కేవలం రూ.300 మాత్రం ఇవ్వండి. తద్వారా రూ.800 ఖర్చు చేసే ఫుడ్ కేవలం రూ.300కే పొందవచ్చు అని చెప్పాడు. దీంతో వినయ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. జొమాటోలో ఇంత పెద్ద మోసం జరుగుతుందా? అని అనుకుని, ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించడంతో అది వైరల్ అయింది. దీనిపై జొమాటో సీఈవో గోయల్ సైతం స్పందించారు. ఈ స్కామ్‌పై స్పందిస్తూ కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments