Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రాష్ట్రంలో జికా వైరస్ ఎంట్రీ.. తొలి కేసు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (11:48 IST)
ఆఫ్రికా దేశాల్లో కనిపించే జికా వైరస్ తొలిసారి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీంతో జికా తొలి కేసు కేరళ రాష్ట్రంలో నమోదైంది. పరస్సాలాకు చెందిన 24 ఏళ్ల గర్భిణీ స్త్రీకి జికా వైరస్ సోకిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 
 
గత నెలలో బాధితురాలు జ్వరం, తలనొప్పితో పాటు , చర్మంపై ఎర్రటి గుర్తులు వంటి లక్షణాలతో హాస్పిటల్‌కి ట్రీట్మెంట్ కోసం వెళ్లిందని.. ప్రాథమిక పరీక్షలలో ఆమెకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని చెప్పారు.
 
జికా సోకి చికిత్స పొందుతున్న బాధితురాలు జూన్ 7న తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య అధికారులు చెప్పారు. బిడ్డలో కూడా వైరస్ లక్షణాలు లేవని తెలిపారు. 
 
మరోవైపు, తిరువనంతపురం జిల్లా నుంచి 19 శాంపిల్స్‌ ను టెస్టులు చేయగా వాటిల్లో 13 పాజిటివ్‌ కేసులని అనుమానిస్తున్నారు. దీంతో వీరందరి శాంపిల్స్ పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments